చిత్తూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమం

0 9,882

చిత్తూరు   ముచ్చట్లు:

 

ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ [ఐ] చిత్తూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమం  జరిగింది. చిత్తూరు జిల్లా ఐటా అడ్వైజర్ కమిటీ ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావం, సేవానిరతి, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసే ఉపాధ్యాయులు గుర్తించి వారి సేవలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేయడం జరుగుతున్నది.ఈ కార్యక్రమములో హాఫీస్ అబ్దుల్ అలీం ఉమ్రి మాట్లాడుతూ, మొహమ్మద్ ప్రవక్త  తన గురించి తాను ఉపాధ్యాయునిగా అంటే శిక్షకునిగా చేసి పంపటం జరిగిందని మహమ్మద్ ప్రవక్త అన్నారు. ప్రపంచం ఉన్నంతవరకూ ఉపాధ్యాయుని స్థానం అత్యున్నతమైనది, విద్యకు విజ్ఞానానికి వం ప్రసాదించే వ్యక్తికి ఎన్నడూ మరణం లేదు. కన్న తండ్రి తన కొడుకుని నింగి నుండి నేలకు తీసుకువస్తాడు, కానీ ఆధ్యాత్మిక తండ్రి అంటే గురువు మనిషిని ధరణి నుండి సిద్ధృ తుల్ ముంత హా అనే అంతరిక్షానికి చేరుస్తాడు. గురువు ఒక దీపం వంటివాడు అతడు చీకటి మార్గాలలో అరని వెలుగు దీపాన్ని ప్రజ్వలింపజేసి, సమాజంలో నైతిక రీతిని పెంపొందించడంలో పాత్రను వహిస్తాడు కనుక ఉపాధ్యాయుడు నైతికంగా సు సంపన్నుడై ఉండాలి. అని పేర్కొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags: Chittoor District Best Teacher Award Program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page