హైదరాబాద్ లో యాచకుల హత్య.

0 7,894

హైదరాబాద్  ముచ్చట్లు:

హైదరాబాద్ పరిధిలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు హత్యలు కలకలం సృష్టించాయి. రోడ్డుపై భిక్షాటన చేసుకునే ఇద్దరు యాచకులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. రెండు హత్యలు ఒకేలా జరగడం, అందులోనూ మృతులిద్దరూ యాచకులే కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలపై రాయితో మోది హతమార్చారు. ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా ఇలాగే రాయితో తలపై రాయితో చంపేశారు.సంఘటనా స్థలాల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే రెండు సంఘటనలు ఒకే తరహాలో జరగడంతో ఒక్కడే ఈ రెండు దారుణాలకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Murder of beggars in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page