ఫైన అరటిపండ్లు..లోపల..

0 7,564

హైదరాబాద్ ముచ్చట్లు:

ఏపీ, తెలంగాణలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది. భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. ఈజీ మనీ కోసం అక్రమార్కులు కోట్ల విలువైన మత్తు పదార్థాలను అత్యంత చాకచక్యంగా బోర్డర్లు దాటించేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా గుట్టుగా గంజాయి తరలిస్తున్నారు. తాజాగా అరటి పండ్ల లోడు కింద గంజాయి తరలిస్తున్న వాహనాన్ని హైదరాబాద్ ఎల్బీ నగర్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏవోబీ ఏరియా నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర నాగ్‌పూర్‌కి అరటిపండ్ల లోడుతో వెళ్తున్న అశోక్ లేల్యాండ్ ట్రాలీ వాహనంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బయటికి అరటి పండ్లు కనిపించేలా అమర్చి.. వాటి అడుగు భాగంగా క్వింటాకు పైగా సుమారు 110 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఏవోబీ నుంచి మహారాష్ట్ర నాగ్‌పూర్‌కి గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అరటిపండ్ల లోడు వాహనంలో గుట్టుగా గంజాయి తరలిస్తుండగా అరెస్టు చేశామన్నారు. సుమారు 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని.. దాని విలువ 18 లక్షలకు పైగా ఉంటుందని ఆయన అన్నారు. ఇద్దరు నిందితులు లుంబారామ్(24), కృష్ణారామ్(24)ను అదుపులోకి తీసుకున్నామని.. మరో ఇద్దరు నిందితులు మసాద బాలన్న(32), రషీద్(31) పరారీలో ఉన్నట్లు భగవత్ తెలిపారు.గతంలో మంగీలాల్ అనే వ్యక్తి లుంబారామ్ సోలంకి వద్ద అశోక్ లేల్యాండ్ ట్రక్కును కొనుగోలు చేసి గంజాయి అక్రమ రవానాకి ఉపయోగించేవాడన్నారు. గంజాయి తరలిస్తుండగా మంగీలాల్‌ని మధ్యప్రదేశ్‌లోని నర్శింగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారని.. ములాఖత్‌కి వెళ్లిన లుంబారామ్ గంజాయి రవాణా గురించి తెలుసుకుని స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. లుంబారామ్ మరో ముగ్గురితో కలసి గంజాయి రవాణా చేస్తున్నాడని.. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Top bananas..inside

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page