పాత ప్రభుత్వ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్య ఆనం.

0 7,556

నెల్లూరు    ముచ్చట్లు:

నెల్లూర్ జిల్లా రాపురు మండలంలోని పాత భవనాలను ఎమ్మెల్యే  ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత అయన కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల  మేరకు నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా  రెండు చోట్ల పాత భవనాలు ఉన్నాయి. ముందుగా వెంకటగిరిలో తహసీల్దార్ కార్యాలయం ఉంది. రాపురు లో తహసీల్దార్ కార్యాలయం, రిజిస్ట్రేషన్ ఆఫీసు,  ట్రెజరీ ఉన్నాయి. వాటిని కొత్త భవనాలుగా తీర్చిదిద్దాలని అలాగే రాపూరు లో ఉన్న తాసిల్దార్ కార్యాలయం ఉన్న చోటులోనే కొత్త భవనం నిర్మించాలని అన్నారు.  పోలీస్ స్టేషన్,  మండల్  ఆఫీస్ అన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఈ తాసిల్దార్ కార్యాలయం కూడా ఇక్కడే కొత్త భవనం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో  సి ఐ నాగ మల్లేశ్వరరావు,  ఎంపీడీవో  మహేష్ బాబు, ఎస్ ఐ కాంతి కుమార్ పట్టాభిరామిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Emmely Anam inspecting old government buildings

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page