ఏపీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.

0 7,568

అమరావతి ముచ్చట్లు:

ఏపీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌పై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇన్‌స్టెంట్‌ బీర్‌ తయారీ నిమిత్తం మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ.. దాఖలలైన అర్జీపై ఎక్సైజ్‌ శాఖ స్పందించలేదు. దీంతో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌ను మంగళవారం ధర్మాసనం ఎదుట హాజరుకావాలని అదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను ఆయన పట్టించుకోలేదు. దీంతో జస్టిస్‌ దేవానంద్‌ ధర్మాసనం ఈ మేరకు రజత్‌ భార్గవ్‌‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. కాగా పిటిషనర్ తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Non-bailable warrant issued against AP Special Chief Secretary Rajat Bhargava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page