టిటి‌డి అట‌వీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ.

0 87,587

తిరుమల   ముచ్చట్లు:

 

టిటిడి అట‌వీ శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ బుధ‌వారం తిరుమ‌ల‌ క‌ట్టెల డిపోలో డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి ఆధ్వ‌ర్యంలో ‌జరిగింది.ఈ సందర్భంగా అట‌వీ విభాగం వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి చిత్ర ప‌ట్టానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌.ఆర్‌.వోలు శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, శ్రీ వెంక‌ట సుబ్బ‌య్య‌, శ్రీ స్వామి వివేకానంద‌, డిఆర్‌వో శ్రీ శ్రీ‌నివాసులు, అట‌వీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Ayudha Puja under the auspices of TTD Forest Department.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page