బద్వేలు… మరో రికార్డ్

0 78,773

కడప ముచ్చట్లు:

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధమ్మ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై ఆమె ఏకంగా 90, 533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్‌ ప్రజలు కేవలం భాజపానే కాదు.. తెదేపా, జనసేనలను కూడా ఓడించారన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన.. బరిలో నిలవనప్పటికీ బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఎంపీ ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు తెర వెనుక ఉంటూ బీజేపీకి 20వేల ఒట్లు వేయించారని నందిగం సురేశ్‌ తెలిపారు. ఇక ఉప ఎన్నికలకు వెళ్లనంటూనే భాజపాకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు
‘వైసీపీని చూస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది. ఈకారణంగానే కుప్పంలో ఉండమంటారా? వద్దా? అని తన నియోజకవర్గ ప్రజలను అడిగే స్థాయికి ఆయన చేరుకున్నారు. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర ద్వారా తిరుపతి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రమే అమరావతి ఏకైక రాజధానుగా ఉండాలని కోరుకుంటున్నారు. రైతుల పాదయాత్రలో ఏవైనా గొడవలు జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని ఈ సందర్భంగా ఎంపీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Badvelu … another record

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page