చట్టాల గురించి అవగహన ఉంటే నేరాలు నియంత్రణలో ఉంటాయి.

0 78,561

కామారెడ్డి  ముచ్చట్లు:

:చట్టాల గురించి అవగహన ఉంటే నేరాలు నియంత్రణలో ఉంటాయని నాగిరెడ్డిపేట్ ఎంపిపి .రాజ్ దాస్ అన్నారు. బుధవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని రాఘవపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో న్యాయవాది నామా శ్రీకాంత్ అధ్యక్షతన న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆహ్వానితులుగా హాజరైన ఎంపీపీ దివిటి రాజ్ దాస్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా స్థానిక కోర్ట్ న్యాయ వాదుల ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయ సదస్సులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చెడుకోవాలన్నారు. అనంతరం న్యాయవాది నసమ శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామాల్లో కొట్లాటలు జరుగుతాయని, క్షనిక ఆవేశంలో కొట్టుకొని తరువాత బాధ పడతారని, చట్టాల గురించి కాస్త అయిన తెలిసి ఉంటే గొడవ పడే ముందు జరగ్స్ బోయే నష్టాన్ని గుర్తు చేసుకొని గొడవలకు దూరం ఉంటారన్నారు. భారత రాజ్యాంగంలో చట్టాలు అందరికి ఒక్కటే అన్నారు. సుప్రీం కోర్ట్ మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి చట్టాల పై అవగాహన పెంపొందించే కార్యక్రమం చేపట్టిందన్నారు. న్యాయ చైతన్య సదస్సుకు ప్రతి ఒక్కరు హాజరై న్యాయవాదులు తెలిపే చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యకర్సమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Crime is under control if there is awareness about the laws

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page