విశాఖలో దీపావళి పండగ శోభ.

0 8,678

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో దీపావళి పండగ శోభ కనిపిస్తోంది. టపాసులు, ప్రమిదలు, స్వీట్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. గత రెండేళ్లుగా అంతంతమాత్రంగానే పండగ నిర్వహిం చుకోగా… ఈసారి ఘనంగా జరుపుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. రేపే పండగ ఉండటంతో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశముంది. స్టీల్ సిటీకి దీపావళి శోభ సంతరించుకుంది. దీపావళి అంటే.. పటాకుల మోత మోగించాల్సిందే. దీపావళి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కాకరపూల వెలుగులు, టపాసుల ఢాం..ఢాం శబ్దాలు. చిన్నాపెద్దా తేడా లేకుండా టపాసులను కాలుస్తుంటారు.దీపావళి సందర్భంగా మార్కెట్‌లోకి రకరకాల పటాకులు అందుబాటులోకి వచ్చాయి. కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పెన్సిల్స్,  తాళ్లు, థౌజండ్‌ వాలా, రాకెట్లు, లక్ష్మీ బాంబులు, సుతీల్‌, పిట్ట బాంబులు, తోక పటాసులు, వెన్నముద్దలు, పాము బిళ్లలు, అగ్గిపెట్టెలు, రంగరంగుల క్రాకర్స్‌ను మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా యి.విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైధానంలో ఏర్పాటైన విక్రయాల్లో ఈ సారి గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు జోరుగా సాగుతు న్నాయి.వీటిపై అవగాహన రావడం, కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో విక్రయాలు గతం కంటే మెరుగ్గా జరుగుతున్నాయని వ్యాపారస్ధులు చెబుతున్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Diwali is a festival in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page