బాబుకు కావాల్సింది రియల్ ఎస్టేట్ మాత్రమే

0 85,459

విజయవాడ  ముచ్చట్లు:

అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు స్థానం లేదా..?  అన్నీ అమరావతిలోనే పెట్టాలని బాబు పాదయాత్ర చేయిస్తాడా..!?  అమరావతిలోని తన బినామీ భూములకు ధరలు పడిపోతున్నాయన్నదే బాబు బాధ అని వైకాపా ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.  బాబు ప్రజా రాజధానిని కోరుకోలేదు.  అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లేని అమరావతి కావాలనుకున్నాడు.  బాబుకు కావాల్సింది స్టేట్ కాదు. రియల్ ఎస్టేట్ మాత్రమే.  రాష్ట్రానికి గెస్టుగా వచ్చి వెళ్ళే బాబును రాష్ట్ర ప్రజలు గెస్టు గానే చూస్తున్నారు.  అధికారం లేకపోతే.. చంద్రబాబుకు ఈ రాష్ట్రం కేవలం ఒక విడిది లాంటిది మాత్రమే.  పాదయాత్ర వల్ల రాలసీమ, ఉత్తరాంధ్రలో గొడవలు జరిగితే.. వాటికి బాబు బాధ్యత వహిస్తాడా..?  రాయలసీమకు వెళ్ళి మీకు రాజధాని ఇవ్వటానికి వీల్లేదు అని బాబు పాదయాత్ర చేస్తాడా అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలవారు ఉంటే తాను కలలుగన్న అమరావతి మురికికూపంగా మారిపోతుందని చంద్రబాబు మాట్లాడాడు.. తమను వద్దు అనుకున్న చంద్రబాబు కూడా రాష్ట్రానికి అవసరం లేదని ఈ వర్గాలంతా ఏకమై ప్రతి ఎన్నికలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు. జగనన్న నాయకత్వానికి జై కొడుతున్నారు.  – అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. దానితోపాటే మిగతా నగరాల మాదిరిగానే సహజంగా అమరావతి అభివృద్ధి అవుతుంది. అయితే, ఇదే సమయంలో విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని వస్తుందంటే… మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందంటే.. దానిని బాబు ఎందుకు అడ్డుకున్నాడో ఆయనే చెప్పాలని అన్నారు.
అలాగే, కర్నూలుకు హైకోర్టు వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకున్నాడో కూడా ఆయనే చెప్పాలి. అమరావతిలో శాసన రాజధాని ఉండటానికి వీల్లేదని ఎవరూ అనటం లేదు. కానీ, రాయలసీమలో అభివృద్ధి ఉండకూడదని, ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఉండకూడదని, అంతా తనకే, తన బినామీ భూముల రేట్ల కోసం కావాలని బాబు అడుగుతున్నాడు. దానికోసమే తిరుపతి యాత్ర మొదలు పెట్టించాడు. ఇది మిగతా ప్రాంతాల ప్రజల్ని అవమానించడం, రెచ్చగొట్టడం కాదా..?
అమరావతిలో చంద్రబాబు తన బినామీలను కొంతమందిని పెట్టుకుని, వారితో కెమెరాల ఉద్యమం చేయిస్తూ, దానికి 300 రోజులు, 600 రోజులు అని డప్పాలు  కొట్టుకుంటూ .. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ తన బినామీల చేత  యాత్రలు చేయిస్తున్నాడు. “మేము మాత్రమే బాగుండాలి.. మిగిలిన ప్రాంతాలవారు ఏమైపోయినా ఫర్వాలేదు” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్టు, ఆయన అనుకున్న పాంత్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలని, ఇక్కడ తన దాయాదులను కొంతమందిని పెట్టుకుని యాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాడని విమర్శించారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Should light up people’s lives.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page