వైసీపీ కష్టానికి తగ్గ ఫలితం.

0 7,562

కడప ముచ్చట్లు:

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికను వైసీపీ తేలిగ్గా తీసుకోలేదు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార పార్టీ వైసీపీ కేడర్‌ పనిచేసింది. అన్ని వర్గాలను కలుపుకుని వైసీపీ నేతలు భారీ విజయం కోసం కృషి చేశారు. ద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీ సాధించింది. ఇంచుమించు లక్ష మెజారిటీని సాధించింది. ఇంత మెజారిటీ కేవలం జగన్ క్రేజ్ వల్లనే వచ్చిందా? సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో ఆయన సతీమణి పోటీ చేయడంతో సానుభూతితో వచ్చిందా? తెలుగుదేశం పార్టీ చేతకానితనం వల్ల వచ్చిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేతలు తొలి నుంచి తమకు లక్ష మెజారిటీ వస్తుందని చెబుతూ వస్తున్నారు. 1,47 వేల ఓట్లు పోలయ్యాయి. ఇందులో లక్ష పైగా ఓట్లను బీజేపీ దాదాపుగా సాధించింది.వైసీపీ అంచనాలకు తగినట్లుగానే దాదాపుగా అటు ఇటుగానే వచ్చింది. దీంతో వైసీపీ నేతల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు వచ్చిన మెజారిటీని మించి ఇక్కడ సాధించారు. బద్వేలు ఉప ఎన్నికను తొలి నుంచి వైసీపీ నిర్లక్ష్యం చేయలేదు. వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధనే జగన్ నిర్ణయించడం కూడా కొంత అనుకూలంగా మారింది. దీంతో పాటు తన సంక్షేమ పథకాలకు జనం సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా జగన్ చూసుకోవాలనుకున్నారు. అందుకే పెద్దయెత్తున మంత్రులను, ఎమ్మెల్యేలను బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలోకి దించారు.అయితే ఇదే సమయంలో జగన్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకుండా ఉండాలంటే టీడీపీ పోటీ చేయాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ నెత్తని పాలు పోసినట్లయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఈ ఉప ఎన్నికతో తన ఓటు బ్యాంకును తానే చెల్లాచెదురు చేసుకున్నట్లయింది. అదే టీడీపీ బరిలో ఉండి ఉంటే ఇంత భారీ స్థాయి మెజారిటీ వచ్చేది కాదు.

 

- Advertisement -

అధికార పార్టీని కొంత ఆలోచనలో పడేసినట్లయ్యేది.కానీ చంద్రబాబు ఈ ఉప ఎన్నికలోనూ వ్యూహాత్మక తప్పిదం చేశారు. వైసీపీకి మరో మూడేళ్ల పాటు చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. జనం జగన్ వెంటే ఉన్నారన్నది మరోసారి బద్వేలు ఉప ఎన్నిక ఫలితం ద్వారా స్పష్టమయింది. ఇప్పటి వరకూ చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకత బద్వేలు ఎన్నికలో ఎంతమాత్రం కన్పించలేదు. ఈ అవకాశాన్ని చంద్రబాబు జగన్ కు కల్పించారనుకోవాల్సిందే. తప్పుల మీద తప్పులు చేస్తూ చంద్రబాబు జగన్ కు అడ్డంగా దొరికిపోతున్నారు.:ఎక్కడ కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్లకపోయినా ప్రతి కుటుంబానికి లేఖ రాశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ ప్రజల ఆశీస్సులు కావాలని సీఎం లేఖలో కోరారు.అటు టీడీపీ మొదట పోటీ చేస్తామని అభ్యర్థి పేరు ప్రకటించి, ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. అటు, జనసేన పోటీ చేయడం లేదని చెబుతూనే బీజేపీకి మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ పోటీ చేసినా, ఓటర్లు వైసీపీ వైపుకే మొగ్గు చూపారు. దీంతో ప్రత్యక్షంగా జనసేన, పరోక్షంగా టీడీపీ బద్వేల్‌లో బీజేపీకి మద్దతు తెలిపినా, వైసీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందారు.చివరి వరకు మిగతా పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీపై డైలమాలో పడటంతో వైసీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. దీంతో 90 వేల 590 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి సుధ. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ భారీగా ఓట్ల శాతాన్ని రాబట్టింది.

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:The result of the YCP difficulty reduction

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page