ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ చేయొద్దు,ఎస్ఎఫ్ఐ డిమాండ్.

0 7,896

కాకినాడ ముచ్చట్లు:

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు  ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూ ఐడియల్ జూనియర్ కళాశాల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి M. గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబరు 42 ,50 వల్ల రాష్ట్రంలో ఉన్న  ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం  ప్రభుత్వం లో ఉంటారా? లేదా ప్రైవేటుగా కొనసాగించుకుంటారా? ఉంటారా అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని అందులో భాగంగా కాకినాడ నగరంలో ఉన్న అనేక జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ఉంటే ప్రభుత్వం లో ఉండాలి లేకపోతే ప్రైవేట్ గా నడుపు కోవాలని కాకినాడ నగరంలో అనేక ఎయిడెడ్ కళాశాల లు ప్రభుత్వానికి రాసి ఇవ్వడం జరిగింది. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే కళాశాలలో చదువుకోవాలంటే ఎక్కువ పేజీలతో  చదువుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేస్తే పిల్లలు చదువుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం గతంలో రాసిన ఇచ్చిన  విద్యాసంస్థలు మళ్ళీ తిరిగి రాసి ఇస్తే  ఎయిడ్ గా కొనసాగిస్తామని రాసి ఇస్తే వాటిని ఎయిడెడ్  కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కాబట్టి తక్షణమే కాకినాడ నగరం లో ఉన్నటువంటి ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యాసంస్థలు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నడపాలనీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బాధ్యత తీసుకుని నడపాలని లేకపోతే ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు .ప్రభుత్వం ఎయిడ్ కొనసాగించడమే కాకుండా జీవో నెంబర్ 35, 36 ని రద్దు చేసి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ చిరంజీవిని కుమారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం  స్పందించిన చిరంజీవినీ కుమారి గారు విద్యార్థులందరి ఉపయోగపడేలా కమిటీలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కళాశాల నాయకులు ఉమా శంకర్ ,అవినాష్, సూర్య, సందీప్ ,లలితా ,శివ, నీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Do not privatize aided educational institutions, SFI demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page