ఆదిశంకరాచార్యుల పల్లకిసేవ

0 9,689

గూడూరు ముచ్చట్లు:

 

ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మం,  హైందవ ధర్మం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందేందుకు ఎనలేని కృషి చేశారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద రావు తెలిపారు .   చిల్లకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో ఆదిశంకరాచార్యులు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు .  ఈ కార్యక్రమంలో  చిల్లకూరు జడ్పిటిసి సభ్యులు  మన్యం శ్రీనివాసులు , చిల్లకూరు వైస్ ఎంపీపీ కుమారస్వామి రెడ్డి ,   జానకి రామ్ రెడ్డి  , ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
కేదార్ నాథ్  లో  ఆదిశంకరాచార్యులు సమాధిని పునర్నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది .  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  కేదార్నాథ్  లో  ఆదిశంకరాచార్యులు సమాధి పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు . ఈ సందర్భంగా చిలుకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో ఆదిశంకరాచార్యులు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంతో పాటు మానవత్వం పట్ల ప్రజల్ని చైతన్య పరిచారని కొనియాడారు . ఆదిశంకరాచార్యులు సమాధిని పునర్నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు .  మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ  కేదార్ నాథ్ లో  ఆదిశంకరాచార్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని తెలిపారు .  ఆదిశంకరాచార్యులు ఈ దేవస్థానాన్ని  కూడా ఆయన దర్శించడం జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది అన్నారు .

 

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; Pallakiseva of Adi Shankaracharya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page