మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్

0 7,566

ముంబై  ముచ్చట్లు:

సినిమాతారలు పలురకాల వ్యాపారాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరో, హీరోయిన్లుగా చేస్తూనే మరో వైపు వ్యాపారాలతోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అటు హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్, సమంత లాంటి వాళ్ళు కూడా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే ఆహా ఓటీటీ మద్యంమంలో భాగస్వామిగా ఉన్నారు అల్లు అర్జున్. అలాగే అల్లు స్టూడియోస్ లోకూడా బన్నీకి భాగస్వామ్యం వుంది. ఇక ఇప్పుడు సరి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు అల్లము అర్జున్.ఏషియన్ గ్రూప్ తో కలసి ధియేటర్ నిర్మాణంలో భాగమయ్యారు ఐకాన్ స్టార్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తో  హైదరాబాద్ లో థియేటర్ నిర్మిస్తున్నారు అల్లు అర్జున్. ఈ థియేటర్ నిర్మాణానికి ఈరోజు అల్లు అర్జున్  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ పేరుతో థియేటర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా మెహబూబ్ నగర్‌లో ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఓ థియేటర్‌ను నిర్మించారు. ఇప్పుడు ఇదే బాటలో ఐకాన్ స్టార్ కూడా  థియేటర్ ఓనర్ అయ్యారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Allu Arjun into another business

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page