మావోయిస్ట్ ల పేరుతో బెదిరింపు లకు పాల్పడుతున్న  గ్యాంగ్ అరెస్ట్

0 9,761

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నలుగురు మాజీ మావోయిస్టులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ యాదాద్రి బోనగిరి ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ లో నలుగురు మాజీ మావోయిస్టులను అరెస్ట్ చేశారు. భువనగిరి యాదాద్రి ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడుతుంది ఈ ముఠా. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశతో అక్రమ మార్గం ఎంచుకున్నారు. సామాన్యులను తుపాకులు చూపి వసూళ్లకు పాల్పడేదుకు ప్లాన్ చేశారు. ఆ సమయంలోనే వీరిని అరెస్ట్ చేశామని అన్నారు. నలుగురు లో ప్రధాన నిందితుడు పిట్ల శ్రీనివాస్. సొంతంగా వెపన్స్  తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడు. పిట్టల శ్రీనివాస్, వాళ్ళలా నగమళ్లయ్యా, ఎదవల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి, అరెస్ట్ చేసాం. అరెస్ట్ అయిన నలుగురు సీపీఐ జనశక్తి , మావోయిస్టు పార్టీ లో గతంలో పనిచేశారు. అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నారు. ఒక తపంచా, ఒక పిస్టల్, ఒక రివాల్వర్చ ఒక చిన్న గ్యాస్ సిలెండర్స్, ఆరు పిస్టల్ లైవ్ రౌండ్స్, బుల్లెట్స్, మూడు మొబైల్స్, ఒక డ్రిల్లింగ్ మిషన్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నాం.  భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ తెలంగాణ రాష్టం  అనే పేరుతో గ్యాంగ్ గా ఏర్పడి కాంట్రాక్టర్లను బెదిరింపులకు పాల్పడుతున్నారు.  నిందితుల పైన  ఆమ్స్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు.

- Advertisement -

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం

Tags; Gang arrested for making threats in the name of Maoists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page