జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ పోర్ట్, కొరియర్  కార్యాలయాలు, గోడౌన్ లలో పోలీసుల తనిఖీలు

0 9,667

కడప  ముచ్చట్లు:

 

కడప  జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ పోర్ట్, కొరియర్ సంస్థల కార్యాలయాలు, గోడౌన్ లలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువుల రవాణా పై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పివని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని ట్రాన్స్పోర్ట్, కొరియర్ సంస్థలలోని సరకుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడయినా అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే  వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని జిల్లా ఎస్.పి సూచించారు. సమాచారమిచ్చిన వారి  వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Police inspections at transport, courier offices and godowns across the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page