రాష్ట్రంలో సుభిక్ష  పాలన సాగుతోంది

0 9,692

-ప్రజా సంకల్పయాత్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.

 

కడప ముచ్చట్లు:

 

- Advertisement -

సంక్షేమం, అభివృద్ధి.. అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు.. అని, ప్రస్తుతం రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతోందని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం నగరంలోని హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ లో నాలుగేళ్లు పూర్తిచేసుకున్న  వైఎస్ఆర్ పార్టీ ప్రజాసంకల్ప యాత్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేసి పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ  2017లో అప్పటి ప్రభుత్వ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర, నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఆ నాడు యువనేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఫలితంగా.. ఈనాడు రాష్ట్రంలో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు.  వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి  సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నారన్నారు. ‘అభివృద్ధి అంటే నిన్నటి కంటే నేడు బావుండటం.. నేటి కంటే రేపు మరింత బావుంటుందని నమ్మకం కలిగించడం’ అని సరికొత్త నిర్వచనం చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో పారదర్శకత, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను 95% శాతం పూర్తిచేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారన్నారు.

 

 

 

సచివాలయ వ్యవస్థ ద్వారా.. గ్రామసీమల్లో ఇంటిముందుకే వచ్చిన సంక్షేమాన్ని చూసి ప్రజలు జగన్ను గుండెల్లో నింపుకుంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాల ప్రజలకు రాజ్యాధికారంలో సమన్యాయం అందివ్వడంతో.. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు.. అనంతరం వాటి పనితీరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన దక్షతపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ప్రతి పథకానికి నిర్ణీత కాల వ్యవధిలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముంతాజ్, నిత్యానంద రెడ్డి,  పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నగర కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు,  వైఎస్ఆర్ సిపి అభిమానులు పెద్ద ఎత్తున హాజరై.. సంబరాలు జరుపుకున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Prosperous rule prevails in the state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page