సైనికుల వద్ద లంచం తీసుకొన్న రెవిన్యూ సిబ్బంది.

0 7,472

అనంతపురంముచ్చట్లు:

దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులు దగ్గర కూడా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే అమరాపురం మండలం ఉదుగురు  గ్రామానికి చెందిన నరసింహమూర్తి బీఎస్ఎఫ్ జవాన్.  దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. .వ్యక్తిగత సెలవుల నిమిత్తం ఊరికి రావడం జరిగింది. అందులోనే ఇంటికి సంబంధించిన డీ ఫారమ్ rm కాపీ తీసుకోవడానికి అమరాపురం మండలం లో  తహశీల్దారు  కార్యాలయానికి వెళ్లాడు. .అక్కడ పని చేస్తున్న అటెండర్ శివన్న సంప్రదించి వివరాలు చెప్పాడు. అతను ఆ పట్టా కాఫీ ఇవ్వడానికి ఆరువేల రూపాయలు లంచం  అడిగాడు. అందుకు సోల్జర్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల దగ్గర లంచాలు తీసుకోవడం ఏంటి సార్ అని ప్రశ్నించాడు. అవి పాత ఫైలు వెతకడానికి చాలా కష్టంగా ఉంటుంది నేను అడిగిన అమౌంట్ ఇస్తే మీరు ఫైలును వెతికి ఇస్తానని శివన్న  అన్నాడు. అందుకు సోల్జర్ ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వలేను. రెండు వేలు ఇస్తానని చెప్పి ఇచ్చాడు. బార్డర్ లో పనిచేసేటువంటి ఒక సైనికుని దగ్గరనే ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం చాలా దారుణంజ నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని దయచేసి దీనికి న్యాయం చేయమని నరసింహమూర్తి అంటున్నాడు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Revenue staff who took bribes at soldiers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page