పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి – కమిషనర్ దినేష్ కుమార్

0 9,863

నెల్లూరు ముచ్చట్లు:

 

నగర పాలక సంస్థ పాలక మండలి సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 15 వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ అందించామని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక వై.ఎమ్.సి.ఏ మైదానంలోని వి.ఆర్.ఐ.పి.ఎస్ కేంద్రంలో జరుగుతున్న శిక్షణా తరగతులను కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 54 డివిజన్లకు 471 నామినేషన్లు దాఖలు అయ్యాయని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 8 వ తేదీన అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. పోలింగ్ సిబ్బంది శిక్షణలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, ఓటర్ ఐ.డి పరిశీలన, ఓటు వేయించే విధానం, మార్కింగ్ షీట్ల నిర్వహణ వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగం కోసం ఏర్పాటు చేస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై స్పష్టమైన నిర్దేశకాలను సూచించి, ఎన్నికల సిబ్బంది మొత్తం ఓటు వేసేలా పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. మొత్తం 1100 మంది సిబ్బందికి శిక్షణ అందించామని, పోలింగ్ సరళిని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని వివరించారు. 8 వ తేదీ అభ్యర్థుల ఖరారు అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సర్వం సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Training for polling staff completed – Commissioner Dinesh Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page