యాగంటిలో కార్తీక శోభ.

0 7,601

కర్నూలు ముచ్చట్లు:

కార్తీక మాసం సందర్భంగా కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోనిబ్ యాగంటి ఉమామహేశ్వర శైవ క్షేత్రం లో కార్తీక శోభ సంతరించుకుంది.ఈనెల 5వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో  ఆలయ ప్రాంగణం  శివ నామస్మరణతో మారుమోగుతోంది.సోమవారం  ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కుంకుమార్చన సహస్ర నామావళి మధ్యాహ్నం మహానివేదన జరిగింది.రాత్రి స్వామివార్ల పల్లకి సేవ ఉత్సవం నిర్వహించారు.  మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు.ఆలయ కార్య నిర్వహణాధికారి ప్రసాద్ యాగంటి ఆలయ  చైర్మన్ బుచ్చిరెడ్డి కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఉమామహేశ్వరుని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Karthika Shobha in Yaganti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page