నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారకా క్రియేషన్స్ ‘అఖండ’ టైటిల్ సాంగ్ విడుదల

0 56

 

సినిమా ముచ్చట్లు:

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన ఈ పాట ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలిచేలా ఉంది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించడం ప్రత్యేకమైన విషయం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు. మొదటగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆ పాట తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరల్ అయింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwarka Creations ‘Akhanda’ title song released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page