ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలి- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య  

0 7,578

ములుగుముచ్చట్లు:

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన గుణాత్మక విద్య బోధించాలని ప్రాథమిక  ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కు సంబంధించి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాల విద్య నైపుణ్యాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ పాఠశాల పున ప్రారంభం అయ్యాయని,  గత జనవరి నుండి కరోనా కారణంగా  పాఠశాలలు నడవక విద్యార్థినీ విద్యార్థులు స్కూలుకు వెళ్లక చదువులపై వెనుకబడి ఉన్నారని,  వారిని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత  ఉపాధ్యాయులపై ఉన్నదని అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు క్రమశిక్షణగా పాఠశాలకు హాజరు కావాలని ఆన్లైన్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని ఎం ఈ ఓ లందరూ స్టూడెంట్ అటెండెన్స్ నోట్ చేస్తున్నారో లేదో క్రాస్ వెరిఫికేషన్ చేయాలని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని ఏ విద్యార్థి అయినా డ్రాపౌట్ అయినట్లయితే క్లాస్ టీచర్ ఎస్ సి ఆర్ పి, సి ఆర్ పి బాధ్యత తీసుకొని విద్యార్థి స్కూల్ కు వచ్చే విధంగా చూడాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నామని విద్యార్థులకు ఉన్న దాంట్లో సిలబస్ పూర్తి చేసి విద్యా నైపుణ్యాలు మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ లెసన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని,  విలేజి ఎడ్యుకేషన్ లిస్టు అప్లోడ్ చేయాలని ప్రతి టీచర్ క్లాస్ కు వస్తున్నారా లేదా వారు చెప్పదలచిన సబ్జెక్ట్ గురించి ఎలా  ప్రిపేర్ అయి చెబుతున్నారు. అనేదానిపై హెచ్ఎం లు వారి వారి స్కూల్ టీచర్స్ వారిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని మండల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అర్హత కలిగిన వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధ్యాయులకు ఏదైనా అనారోగ్యాలతో సెలవులు పెట్టినట్లయితే తప్పనిసరిగా ఆన్లైన్లో లీవ్ అప్లై చేసే విధంగా చూడాలన్నారు. రిటైర్ అయిన ఉపాధ్యాయులకు గాని వారి సర్వీస్ రూల్స్ కు సంబంధించిన విషయాలపై పెండింగ్లో పెట్టకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయుల పై ఉన్నదని  హితబోధ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జీ పానిని, సమగ్ర శిక్షణ క్వాలిటీ కోఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి భాగ్యలక్ష్మి డిసిసిబి సెక్రెటరీ
విజయలక్ష్మి సంబంధిత ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Provide quality education in government schools- District Collector Krishna Aditya
.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page