ధరలు పెంచి నడ్డి విరిచిన కేంద్రం

0 75,771

ఆమనగల్ ముచ్చట్లు:

కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సోమవారం శంకుస్థాపన చేసి, వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఏడేండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం ఒరిగింది ? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటయినా చేశారా ? మోడీ అధికారంలోకి వచ్చిన నాడు 2014లోలఅంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్న నాడు ఈ దేశంలో పెట్రోలు రూ.77, డీజిల్ ధర రూ.68కి లభించింది. ఇప్పుడు క్రూడాయిల్ ధర 83 ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.115, డీజిల్ ధర రూ.107. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని విమర్శించారు. హరితవిప్లవంతో వచ్చిన పంటలను కంట్రోల్ షాపుల ద్వారా ఉత్తరాదిన గోదుమలు, దక్షిణాదిన బియ్యం పంపిణీ చేశారు. 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తులు దేశానికి అందించి ఘనత పంజాబ్ రాష్ట్రానిది. 50 ఏళ్లు ఆ రాష్ట్ర రైతులు దేశానికి ఆహారం అందించడంలో కీలకపాత్ర పోషించారుజ కేసీఆర్  నాయకత్వంలో ఏడేండ్లలో తెలంగాణ రైతాంగం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు అందుబాటులోకి రాక ముందే, సీతారామ, డిండి పథకాలు రాకముందే గత ఏడాది పంజాబ్ రాష్ట్రాన్ని మించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశ కీర్తిశిఖరమై నిలిచింది .. ఇది తెలంగాణ గొప్పతనం. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు పథకాలు, రైతు, వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఇది సాధ్యమయిందని అన్నారు.
ఉత్తరాదిన రెండో పంట వరి సాధ్యం కాదు .. దక్షిణాదిన మాత్రమే రెండో పంట వరి పండుతుంది . అనతికాలంలోనే అత్యధిక దిగుబడులు సాధిస్తూ దేశానికి తలమానికమౌతున్న తెలంగాణకు చేయూతనివ్వకుండా కేంద్రం వివక్ష చూయిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు, మెడికల్ కళాశాలలు, కొత్త మండలాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతి పని ప్రస్తుత, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  దూరదృష్టికి ఏడేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలన నిదర్శనం. ప్రజల ప్రయోజనాల కోసమే మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలలో సమీకృత మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాల పెంపులో భాగంగానే పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మాంసం దుకాణాలు ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్లు ఏర్పాటాయ్యాయి. రహదారుల మీద వ్యాపారం చేసే వారిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, ధూళి, దుమ్ములేని ఉత్పత్తులు ప్రజలకు అందాలన్న దూరదృష్టితో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తున్నది. ప్రజల శ్రేయస్సు నేపథ్యంలో   ఎవరూ సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వ్యతిరేకించవద్దని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The center of inflation and breaking the bank

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page