గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా?: సీఎం కేసీఆర్

0 7,761

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించిన కేసీఆర్ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. తనను దేశద్రోహి అన్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులు కాదు. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా మేము దేశద్రోహులు కాదు. కానీ ఇప్పుడు దేశద్రోహులయం అయ్యాము. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు. అంటే బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా? ఇది బీజేపీ స్టయిల్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని నిలదీసినా వాళ్లు దేశద్రోహులు అయిపోతారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుంది. ఒకటి దేశద్రోహులు. రెండు అర్బన్ నక్సల్స్. ఇంకా గట్టిగా మట్లాడితే అర్బన్ నక్సల్స్ స్టాంప్ వేస్తారు.’’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Whoever speaks loudly is a traitor ?: CM KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page