కాంగ్రెస్‌ లో ఎవరి దారి వారిదే

0 9,665

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసింది…అక్కడ బీజేపీ తరుపున ఈటల రాజేందర్ తెలిచారు…టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్‌కు దారుణంగా 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్‌లకు కారణమైంది…గెలిచిన పార్టీ బాగానే ఉంది…ఓడిన పార్టీ బాగానే ఉంది..కానీ మధ్యలో కాంగ్రెస్‌లో రచ్చ నడుస్తోంది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిని అందరూ ఊహించారు. కానీ 3 వేల ఓట్లు రావడమే పెద్ద ఇబ్బంది అయిపోయింది.సరే ఏదొకటి అయిందని ముందుకెళ్లకుండా..దీన్ని పట్టుకునే కాంగ్రెస్ నేతలు రచ్చ లేపుతున్నారు. పైగా రేవంత్‌ని దారుణంగా టార్గెట్ చేసేస్తున్నారు. ఒక్క హుజూరాబాద్ దెబ్బతో కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది. మొన్నటివరకు ఏదో రకంగా అంతర్గత విభేదాలు సర్దుకున్నాయంటే…ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రేవంత్ రెడ్డిపై డైరక్ట్‌గానే విమర్శలు చేసేస్తున్నారు.తాజాగా వి. హనుమంతరావు….కోమటిరెడ్డిని బుజ్జగించడానికి ఆయన ఇంటికెళ్లారు. కానీ అక్కడ కూడా కోమటిరెడ్డి…రేవంత్‌నే టార్గెట్ చేసి మాట్లాడారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని, కాంగ్రెస్ తన ప్రాణమని, కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడతానని చెప్పారు.

 

 

- Advertisement -

గతంలో కొందరు సోనియాని దెయ్యం అన్నారని, ఇప్పుడు దేవత అంటున్నారని, రేవంత్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ లేదనుకుంటే 6వేల ఓట్లు వచ్చాయని, తెలంగాణలో ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటే 3 వేల ఓట్లు కూడా రాలేదని అన్నారు. కోమటిరెడ్డి ఇలా ఎటాక్ చేస్తుంటే…మరోవైపు పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 వేల మందితో గాంధీభవన్‌కు వచ్చి తేల్చుకుంటానని అంటున్నారు. ఇక ఈయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది.ఇదిలా ఉంటే పార్టీతో సంబంధం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి దూకుడు కనబరుస్తున్నారు. రైతుల కోసం ఒక్కడినే పోరాడతానని, రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చెబుతున్నారు. అంటే కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్తితి ఉంది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Whose way in Congress‌ is theirs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page