మీరు భయపడొద్దు…సోనూకు కేటీఆర్..భరోసా.

0 4,560

హైదరాబాద్ ముచ్చట్లు:

కోవిడ్ కష్టకాలంలో దేశ వ్యాప్తంగా అపారమైన సేవలు అందించి.. ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదించిన సినీ నటుడు సోనూ సూద్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన సేవాధృక్పథాన్ని కొనియాడారు. సోమవారం నాడు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ‌లో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్.. సోనూసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్ధం లేకుండా మనవవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని అన్నారు.తన పని, సేవతో ప్రపంచం దృష్టినే సోనూసూద్ ఆకర్షించారని కొనియాడారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభం అని, బాధ్యతగా సేవ చేయడం గొప్ప విషయం అని అన్నారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలు చేసి ఆయన్ని బయకంపితుడిని చేయాలని చూశారని అన్నారు. సోనూ సూద్ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. వీటిన్నింటికీ సోనూ భయపడాల్సిన అవసరం లేదని, సోనూ రియల్ హీరో అని ఉద్ఘాటించారు మంత్రి కేటీఆర్. తామంతా సోనూ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. ‘మంచి పనులు చేస్తూ ఉండండి. మీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.’ అని ఎన్జీవో సంస్థలకు మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి భరోసా ఇచ్చారు.ఇదిలాఉంటే.. కోవిడ్ సమయంలో ప్రజలకు సహాయం చేసేందుకు మంత్రి కేటీఆర్ అందించిన సహాయ సహకారాలను సోనూ సూద్ కొనియాడారు. కేటీఆర్ లాంటి నాయకుడు అన్నిచోట్లా ఉంటే.. తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదని అన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని, వారికి సహాపడటమే ఇక మన ముందున్న సవాల్ అని పేర్కొన్నారు. ‘‘జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుండే మాత్రమే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ నాకు తారసపడింది. అది కేటీఆర్ కార్యాలయం నుంచి మాత్రమే.’’ అని మంత్రి కేటీఆర్ తనకు అందించిన సహాయ సహకారాలను సోనూ సూద్ గుర్తు చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:You are not afraid … Sonu KTR .. Assurance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page