బూతుల మంత్రులకు అవార్డులు ఇవ్వాలి

0 9,693

– రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

 

అమరావతి ముచ్చట్లు:

 

- Advertisement -

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని అడుగుతుంటే అర్థం లేని మాటలు మాట్లాడుతూన్నారు. బూతులు తిట్టే మంత్రులకు  పద్మశ్రీ తరహాలోనే ఏపీలో అవార్డులు ఇవ్వాలి. ఎర్రి పుష్పాల అవార్డులు  మంత్రులకు ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలకు సహాయం చేయడం కోసమే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుంచింది. బీజేపీ పెట్రోల్, డీజిల్ ఆదయంగా మార్చుకుంటే సోలార్,ఎలక్ట్రానిక్ వాహనాలు ఎందుకు తయారు చేస్తాం. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన  హామీలని అమలు చేయలేదు. బద్వేల్ ఉప ఎన్నికల్లో మిమ్మల్ని దేకించాం. డిపివోలను అడ్డం పెట్టుకొని  ఎన్నికల్లో గెలిచారు. బద్వేల్ ఉపఎన్నికపై చర్చకు సిద్ధమా అని అడిగారు.  బీజేపీ తోక పార్టీ అయితే వైసీపీ ఏంటి? 18రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని మంత్రులు తెలుసు కోవాలి. ఏపీ మంత్రులు భారతదేశంలో ఉన్నారా పాకిస్తాన్ లో ఉన్నారా? ధరలు తగ్గించమని ప్రశ్నిస్తే అసత్యాలతో ప్రకటన ఇస్తారా.

 

 

సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తే దివాలకోరు వ్యాఖ్యలు చేస్తారా. ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. న్యాయం చెయ్యమని అడిగితే పోలీసులతో కొట్టిస్తారా. కేంద్ర ప్రభత్వంపై బురద చల్లాలని చూస్తే అది మీపైనే పడుతుంది. పెట్రోల్ ,డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై సీఎం, సీఎస్ కు లేఖ రాస్తా. డీజిల్,పెట్రోల్ కు పక్క రాష్ట్రానికి ఏపీకి 12రూపాయల తేడా ఉందని అన్నారు. చిప్ లిక్కర్ ను కూడా అధిక ధరకు ప్రభుత్వం అమ్మకాలు చేస్తుంది. జగన్ అన్న కానుకలు అన్ని ప్రజలపై వేసిన భారాల నుంచి ఇస్తున్నవేనని అన్నారు.మంత్రులు అంతా పచ్చ పుష్పాలు, వెర్రి పుష్పాలు. రాజధాని ఇక్కడే ఉండాలని బీజేపీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజధానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి. రాజధాని పేరు చెప్పి పన్నులు వసూలు చేస్తున్నారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర ఏపీలో పోషిస్తుంది.రాజధాని రైతులను ఎందుకు నిరోధించాలి. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ఉద్యమాలు చేసినా అడ్డుకోకూడదు. రైతులపై ప్రభుత్వం ఆంక్షల బీజేపీ ఖండిస్తుంది. బీజేపీ రూలింగ్ చేస్తుంది తప్ప బూమ్ బూమ్ బీర్లు తయారు చేయడం లేదని అయన అన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Awards should be given to whore ministers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page