పెట్రోల్ సుంకాన్ని తగ్గించాలి

0 9,693

మండపేట ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి పాదయాత్రలో ఇచ్చిన  హామీలు అమలు చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేసారు.  పెట్రోల్ డీజిల్ అధిక ధరలు పై కేంద్రం దిగి వచ్చి, పెట్రోల్ పై ఐదు రూపాయలు. డీజిల్ పై పది  రూపాయలు. టాక్స్ తగ్గించిందని, దీంతో పక్క  రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాన్ని తగ్గించి ప్రజలకు మేలు చేయాలని చూస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం  ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అయన అన్నారు. టిడిపి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ పై సుంకం తగ్గించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద టిడిపి నాయకులతో ఆయన నిరసన తెలిపారు. జగన్ పాదయాత్రలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పై పెట్రోల్ డీజిల్ నిరసనగా విమర్శలు గుప్పించించిన జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు ప్రజల వీపుపై బాదుడే బాదుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి డీజిల్ పై సుంకాన్ని తగ్గించి ప్రజల మీద పడుతున్న భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Petrol tariff should be reduced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page