మంత్రి పదవి కోసం పద్మా తాపత్రయం

0 9,695

మెదక్ ముచ్చట్లు:

 

అధికార పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారా?సొంత పార్టీకి చెందిన నాయకుడే…ఆ ఎమ్మెల్యే ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేశారా?ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి చేరిన తరువాత…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?పార్టీ ఆ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిందా?ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్‌కు రాజకీయంగా కీలకమైంది. టిఆర్ఎస్‌లో ప్రారంభం నుంచి ఉన్న నేత పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. మంత్రి పదవి ఆశిస్తూ వస్తున్న పద్మా దేవేందర్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదు. దీంతో తన నియోజకవర్గానికి పరిమితం కావడంతో పాటు పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి.ఐతే…రాజకీయంగా తన నియోజకవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారన్న ప్రచారం గులాభి పార్టీ వర్గాల్లో కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. వచ్చే రాజకీయ ఇబ్బందులు ప్రత్యర్థి పార్టీల నుంచి కాదని తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన ఒక నేతే రాజకీయంగా పద్మా దేవేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మరారని వినికిడి. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీగా…సమాంతరంగా వ్యవహారాలు నడిపించడం మొదలుపెట్టారనే వార్తలు సంచలనంగా మారాయి.

 

 

- Advertisement -

ఇది మొదటి నుంచి ఉన్నప్పటికీ…ఇటీవలే అది కాస్తా పీక్ స్టేజ్‌కు చేరిందట. అది ఈ నోటా…ఆ నోటా పడి…స్వయంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి వెళ్లిందట. దీంతో ఇప్పటి వరకు చూస్తూ చూడనట్టు ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి ఇక సైలెంట్‌గా ఉండటం నష్టం చేస్తుందని భావించి…వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గులాబీ పార్టీ పెద్డల దృష్టికి తీసుకెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డి…తన ఆవేదనను వ్యక్తం చేసారని తెలుస్తోంది. టిఆర్ఎస్ మొదటి నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన నేతల జోక్యంను…ఎమ్మెల్యేలను కాదని చేయడానికి లేదని గులాబీ పార్టీ చెబుతూ వచ్చింది. ఇక పద్మా దేవేందర్ రెడ్డి వ్యవహారంలో…నియోజకవర్గంలో ఆ నేత జోక్యంపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసిందని టాక్‌.ఇకపై మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ నేతకు తేల్చిచెప్పిందట టిఆర్ఎస్. మొత్తానికి…తాజా పరిణామాల తర్వాత మెదక్ నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు వస్తాయో లేదో చూడాల్సిందే మరి.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Padma Tapatrayam for the post of Minister

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page