ఎమ్మెల్సీల కోసం కసరత్తు

0 9,700

విజయవాడ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ   ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా, పదుల సంఖ్యలో ఆశావహలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అధిష్టానం.. జిల్లాల వారీగా నేతల వడబోతను చేపట్టింది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరి పేర్లు ఖరారు అయ్యినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.MLC కోటాలో 3 ఖాళీలు..! స్థానిక సంస్థల కోటాలో 11 ఖాళీలు..! అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ. అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో YCPదే పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కూడా ఏక‌గ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది హైకమాండ్. అన్ని ఈక్వేషన్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.అభ్యర్థుల ఎంపిక విషయంలోరాజ‌కీయ, సామాజిక సమీకరణాలు, జిల్లాల్లో ఉన్న ప్రాధాన్యతతో పాటు.. పార్టీ విధేయుత‌కు పెద్దపీట వేస్తున్నారు.ఎమ్మెల్యే కోటాలో క‌డ‌ప జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డి, శ్రీ‌కాకుళం జిల్లా నుండి పాల‌వ‌ల‌స‌ విక్రాంత్, క‌ర్నూలు జిల్లా నుంచి ఇసాక్ పేర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక, స్థానిక సంస్థల విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు, మ‌ర్రి రాజశేఖ‌ర్, కృష్ణా జిల్లాలో త‌ల‌శిల ర‌ఘురాం, ప్రకాశం జిల్లా నుంచి రంగ‌నాథబాబు, వైజాగ్ నుంచి వంశీ కృష్ణ యాద‌వ్, విజ‌య‌న‌గరం జిల్లా నుంచి ఇందుకూరి ర‌ఘురాజు, తూర్పుగోదావ‌రి నుంచి అనంత‌బాబు, చిత్తూరు జిల్లా భ‌ర‌త్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.అయితే, 14 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు 50 శాతం వ‌ర‌కు కేటాయించే అవకాశం ఉంది. ఒక‌టి రెండు రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. ఆ వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

 

 

 

- Advertisement -

ఇషాక్ భాషా కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతోనే వెళుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు కనపడుతుంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్ భాషా కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ మైనారిటీలకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను గతంలో ముగ్గురికి కేటాయించారు ఇషాక్ భాషాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం రాజకీయ ఎత్తుగడేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్నూలు పట్టణ నియోజకవర్గం తొలి నుంచి వైసీపీకి అండగా ఉంటూ వస్తుంది. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటముల్లో కీలకంగా మారుతున్నారు. మైనారిటీలను వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తమ వైపు తిప్పుకునేందుకు జగన్ ఇషాక్ భాషాకు ఇచ్చారన్న టాక్ పార్టీలో వినపడుతుంది.కర్నూలు పట్టణ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఇప్పటికే హఫీజ్ ఖాన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నూలు పట్టణంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కర్నూలు మాత్రమే కాకుండా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, డోన్ వంటి ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతోనే ఇషాక్ భాషాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని భావిస్తున్నారు.నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ గా ఇషాక్ భాషా ప్రస్తుతం ఉన్నారు. నంద్యాలలో టీడీపీకి ముస్లిం నేతలు ఎక్కువగా ఉన్నారు. టీడీపీకి ఎన్ఎండీ ఫరూక్ నేతగా ఉన్నారు. నంద్యాలలో పార్టీ మరింత బలపడాలంటే ఇషాక్ ను ఎమ్మెల్సీగా చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో నంద్యాల పర్యటనలో భాగంగా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Exercise for emulsifiers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page