వేడి పుట్టిస్తున్న అమిత్ షా టూర్

0 9,710

తిరుపతి ముచ్చట్లు:

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఏపీలో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు జగన్ సర్కార్ మాత్రం తప్పంతా కేంద్రానిదేనని, తాము తగ్గించే ప్రసక్తే లేదని తెల్చి చెబుతోంది. పెట్రో విషయంలో బీజేపీ నేతలు జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఇలా ఏదో ఒక అంశంతో ఏపీలో ప్రతి రోజూ ఉద్రిక్తత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటం రాజకీయ కాక రేపుతోంది. తిరుపతి క్షేత్రం వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యంత కీలకమైన భేటీని ఈ నెల 14న నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం కోమే అమిత్ షా తిరుపతి వస్తున్నారు. దీంతో చాలా కాలానికి వస్తున్న అమిత్ షా.. ఏపీకి ఏం తెస్తారు ఏమేమి  వరాలు ఇవ్వబోతున్నారని జనాలు ఆలోచిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమైనా సానుకూలత అమిత్ షా పర్యటనలో రాష్ట్ర సమస్యలపై ఉద్యమించేందుకు కమ్యూనిస్టులు ప్లాన్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

తిరుపతికి వస్తున్న అమిత్ షాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అమిత్ షా తిరుపతి టూర్ పై సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. అసలు తిరుపతితో మీకేం పని అమిత్ షా అంటూ గట్టిగానే ప్రశ్నించారు నారాయణ. నాడు ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి వచ్చిన మోడీ ప్రత్యేక హోదాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏడేళ్ళు గడిపేశారని విభజన హామీలన్నీ తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. అలాంటి తిరుపతికి ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా వస్తున్నారు అంటూ నారాయణ నిలదీస్తున్నారు. అమిత్ షా ఊరకే వచ్చి వెళ్లిపోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు నారాయణ. ఏపీకి ఆయన న్యాయం చేయాల్సిందే అన్నారు. అమిత్ షా రాక సందర్భంగా నల్ల జెండాలతో సీపీఐ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఏపీకి రావాల్సిన వాటి మీద జగన్ అమిత్ షా ని నిలదీయాలని నారాయణ కోరారు. గతంలోనూ అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సెగ తగిలింది. ఏపీకి న్యాయం చేయాలంటూ జనాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వామపక్షాల నిరసన పిలుపుతో ఈసారి కూడా అమిత్ షాకు తిరుపతిలో నిరసన సెగ తప్పకపోవచ్చని తెలుస్తోంది.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

 

Tags; Heat generating Amit Shah Tour

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page