చిత్తూరు వ్యాప్తంగా వానలు

0 9,706

తిరుపతి ముచ్చట్లు:

 

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. గత అర్ధరాత్రి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతిలోని మాధవ్ నగర్ వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. డీఆర్ మహల్ , రైల్వే అండర్ బ్రిడ్జి పశ్చిమ కింద భారీగా నీరు నిలిచిపోయింది. శ్రీనివాస కల్యాణమండపాల వద్ద రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. ఎక్కడ చూసినా వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయిన గుంతలు తెలియక పడిపోతున్న వాహనదారులు. ఇది తిరుపతి నగరంలో నెలకొన్న తాజా పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తిరుపతి నగరం తయారయింది. పేరుకే స్మార్ట్ సిటీ ఎక్కడ చూసినా గందరగోళం రోడ్లు దెబ్బతినిపోయాయి. తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో చినుకు పడితే చాలు చెరువులా మారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక స్థానికులు అయోమయంలో ఉన్నారు. వర్షం వచ్చిందంటే డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు,

 

 

 

- Advertisement -

స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. నడుము లోతు నీళ్ళు, డ్రైనేజీ నీళ్లతో దుర్గందం. వెరసి ఈ ప్రాంతమంతా తీవ్ర ఇబ్బందులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతం గురించి తెలియని వాహనదారులు ఆటోలు, కార్లు, స్కూటర్లు ఇక్కడ పార్క్ చేస్తే మునిగిపోవడం ఖాయం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ యంత్రాంగం చేష్టలుడిగి పోయింది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం సమీపంలో అన్నదానభవనం పక్కన గల పురాతన భారీ చింత చెట్టు భారీ వర్షానికి విద్యుత్ వైర్లు పై కూలిపోయింది దీనితో తలకోనలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడడం జరిగింది. సిబంది వెంటనే సంబంధిత విద్యుత్ ఏఈ కి స్థానికులు సమాచారం అందించడంతో విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేయడానికి ప్రయత్నం చేశారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Rains across Chittoor9

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page