రేవంత్ కు క్లియర్ అయినట్టేనా

0 9,690

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నామమాత్రం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించినప్పటికీ సీనియర్ నేతలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరవ్వడం తప్పించి గతంలో మాదిరి గాంధీభవన్ కు వచ్చే వారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అక్కడ రేవంత్ రెడ్డి అనుచరుల హడావిడి ఎక్కువగా ఉండటంతో రాలేకపోతున్నామని వి.హనుమంతరావు లాంటి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ సయితం పీసీసీ చీఫ్ నిర్ణయాలను సమర్ధిస్తుండటంతో నేరుగా ఎదుర్కొని లాభం లేదని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొంత పార్టీలో జోష్ పెరిగినా, ఇది పాలపొంగులాంటిదని సీనియర్ నేతలే కొట్టిపారేస్తుండటం విశేషం. రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజంలో విలువలేదని, ఆయనను నేతగా చూడరని కూడా ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం.ఇదే విషయంపై పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక యువనేత ద్వారా రేవంత్ రెడ్డి విషయాలను ప్రస్తావించాలని రెడీ అయిపోయారట. ఇందుకోసం ఆ యువనేత అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీలుంటే ఉత్తరాది రాష్ట్రానికి వెళ్లి ఆ యువనేతను కలిసి రేవంత్ రెడ్డికి క్రెడిబులిటీ లేదని, ఆయనపై ఓటుకు నోటు కేసు ఉన్నా హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఎన్నికలకు ముందు సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.వారి ఆలోచనంతా రేవంత్ రెడ్డిని కట్టడి చేయడమే. నిర్ణయాల్లో, కార్యక్రమాల నిర్వహణలో రేవంత్ రెడ్డి మార్కు లేకుండా చేయాలని, ఇందుకోసం మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఒక కమిటీ వేసి నిర్వహిస్తే బాగుంటుందని కూడా సూచనలు హైకమాండ్ కు అందివ్వనున్నారు. అలాగే మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డిని క్రెడిబులిటీ నేతగా చూపేందుకు కొందరు నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారనే చెప్పాలి.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags;As if it was clear to Rewanth

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page