త్వరలో తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్

0 9,689

నల్గొండ ముచ్చట్లు:

 

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసుకునేందుకు వైద్య పరీక్షలు చేయనుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు హెల్త్ ప్రొఫైల్ నమోదు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీనిని నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్ల్ో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని నిర్వహించేందకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సన్నాహాలు చేస్తుంది. దీనికి అవసమయ్యే నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్యపరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, ఇతర వస్తువులు కొనడానికి తొలివిడతలో రూ. 9.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.మరోవైపు వైద్యపరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను వైద్యారోగ్య శాఖ రూపొందిస్తుంది. ప్రతీ గ్రామంలో 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని రూపొందించనుంది. షుగర్, బీపీ వ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏమి ఉన్నాయో తెలుసుకోవడనాకి హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడనుంది. షుగర్, రక్త పరీక్షల, బీపీ వంటి పరీక్షలు ప్రజల ఇంటి వద్దనే చేయనున్నారు. ఈసీజీ వంటి పరీక్షలు దగ్గర్లోని ప్రాథమికి ఆరోగ్య కేంద్రాల వద్ద చేయనున్నారు. ఇలా సేకరించిన హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి ప్రజలకు ఒక యూనిక్ ఐడీని క్రియెట్ చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో పొందుపరుచనున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా వైద్యుని వద్దకు వెళ్తే డాక్టర్ ఆన్ లైన్ లో రోగి ఆరోగ్య చరిత్రను తెలుసుకునే వీలు కలుగుతుంది.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Health profile in Telangana soon

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page