భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం

0 8,574

రాజమండ్రి ముచ్చట్లు:

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదక స్థితికి చేరాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు ఏరులై పారుతోంది.గూడ్స్ గేట్ శ్యామల సెంటర్ కోటిపల్లి బస్టాండ్,విజయ టాకీస్ ఆర్య పురం దేవి చౌక్,కంబాలచెరువు మెయిన్ సెంటర్ లు,ప్రధాన నగరాలు,నగరంలో ఉన్న రహదారులపై వరద నీరు రావడంతో రోడ్డు మీదకు చేరుకున్న చెత్తాచెదారం వచ్చి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తోంది.వర్షాకాల సమయంలో పునరావృతమవుతున్న సమస్యపై అధికారులు స్పందించాలని స్ధానికులు కోరుతున్నారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Many areas were inundated by heavy rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page