వివాహిత ఆదృశ్యం

0 9,259

కామారెడ్డి ముచ్చట్లు:

 

తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. తల్లి స్రవంతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన స్రవంతి, కరుణాకర్ లు దంపతులు. వీరు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్రవంతి కర్ణాకర్ ల మధ్య బుధవారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన స్రవంతి ఇద్దరు పిల్లలను  తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. రాత్రి అయినా స్రవంతి, పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Married disappearance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page