ధాన్యం కొనుగోలు చేయాలని షర్మిల దీక్ష

0 9,688

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షని ప్రారంభించారు. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వరికోనుగోలు విషయంలో బీజేపీ, కెసిఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ అన్నదాతలకు సున్నం పెడుతున్నారు.  వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్నా కెసిఆర్ లో చలనం లేదు. వడ్లు కొనడంలో కెసిఆర్ కు ఉన్న ఇబ్బందేంటి. కేంద్రానికి ఏజెంట్ గా ఎందుకు మారారో సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టారు. ఆంక్షలు పెట్టినరోజే ఢిల్లీలోనే కదా ధర్నాలు చేయాల్సింది, ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ అది చేతకాక ఇక్కడ ధర్నాలు చేస్తారా. మీరు చేసే ధర్నాల వాళ్ళ ఎవరికి ఉపయోగమని అన్నారు.వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు కెసిఆర్. 20 శాతం బోనస్ ఇచ్చిమరీ వడ్లు కొన్న ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది. పక్క రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై బోనస్ ఇచ్చి ధాన్యం సేకరిస్తుంటే కెసిఆర్ మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు.  పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి కెసిఆర్ కు ఎందుకు లేదు. భారం మొత్తం రైతులపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. రైస్ ఎక్కడ అమ్మాలి, వాటిని ఏం చేసుకుంటారనేది ప్రభుత్వాలు చూసుకోవాల్సింది. రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి.

 

 

 

 

- Advertisement -

మీ కాళ్లుపట్టుకొని బతిమలాడే స్థితికి తీసుకొచ్చేనందుకేనా బీజేపీ, టీఆరెస్ లను అధికారంలోకి తెచ్చింది. మిల్లర్లకు మేలు చేయాలనే కెసిఆర్ ప్రయత్నాలుని ఆరోపించారు. రైతు నష్టపోవాలని, మిల్లర్లు లాభపడాలనే కెసిఆర్ వడ్లు కొనడం లేదు. కెసిఆర్ కు నిజాయితీ ఉంటె సివిల్ సప్లె అడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి. నియంత్రిత వ్యవసాయం మీద  వున్న శ్రద్ద  మద్యం, డ్రగ్స్ పై నియంత్రణ పెడితే రాష్ట్రం బాగుపడుతుంది. డ్రగ్స్ సంస్కృతి జిల్లాలకు పాకింది, ఆ పాపం కెసిఆర్ దే. ప్రజల గొంతు నొక్కేయాలని ధర్నా చౌక్ మూసేయాలని చుసిన కెసిఆర్ కు మళ్ళి అదే వేదిక దిక్కు అయ్యిందని అన్నారు.
మీకు పాలనా చేతకాక ధర్నాలు చేస్తున్నారు. 36 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కెసిఆర్. పంటబీమా, ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతు బంధు పేరిట నాలుగు వేలు ఇస్తూ 24 వేలు ఎగ్గొట్టారు. వడ్లు ఎవరో కొంటె మీ బోడి పెత్తనం ఏంది. కేంద్రం పెత్తనం ఏంటి ఆఖరి గింజ కొంటామని కెసిఆర్ మాట ఇచ్చారు. ఆఖరి గింజ వరకు కెసిఆర్ కొనాల్సిందే. మెడలు వంచుతామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడెందుకు వంచలేకపోతున్నారు. వాళ్ళ మెడలేమైనా లావు అయ్యాయా లేక మీ చేతులు సన్నగా అయ్యాయా. వరి వేయవద్దని చెప్పేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా. లేక కమిషన్ల కోసం కట్టారా. ఉచిత ఎరువుల హామీ ఇంకెప్పుడు అమలు చేస్తావని నిలదీసారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Sharmila’s initiation to buy grain

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page