నాని కలర్స్ మారుస్తారా

0 7,893

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మనసు మార్చుకున్నారా? ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నారు. టీడీపీలో తిరిగి కేశినేని నాని యాక్టివ్ కావడంతో పార్టీలో ఆయన ప్రత్యర్థులు డైలమాలో పడిపోయారు. కేశినేని నాని పార్టీలోని తన శత్రువులపై సరైన బాణమే వేశారంటన్నారు. తిరిగి పార్టీలో తన హవాను కొనసాగేలా ఆయన పావులు కదుపుతున్నారు.కేశినేని నానికి మొన్నటి వరకూ పార్టీలో తిరుగులేదు. కార్పొరేషన్ ఎన్నికలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. సొమ్ముపోయినా సుఖం దక్కలేదన్న సామెత ఆయనకు అక్షరాలా వర్తిస్తుంది. కొట్లాడి మరీ తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటింప చేసుకున్నారు. కానీ ఫలితం దక్కలేదు. నాని కూతురు కార్పొరేటర్ గానే మిగిలిపోయారు. పైగా టీడీపీ నేతలు తనకు వ్యతిరేకంగా పని చేయడాన్ని కేశినేని నాని జీర్ణించుకోలేకపోతున్నారు.కేశినేని నాని పై కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలు పెద్దయెత్తున విమర్శలు చేశారు. కానీ వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి మనస్తాపం చెందిన కేశినేని నాని వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోనని చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కేశినేని భవన్ లో బాబు ఫొటోల తొలగింపు కూడా వివాదమయింది. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి కేశినేని నాని చంద్రబాబు దీక్షలో పాల్గొన్నారు. అధికార వైసీపీని చడా మడా తిట్టేశారు. ఆ తర్వాత జరిగిన కీలక నేతల సమావేశంలోనూ పాల్గొన్నారు.చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ కేశినేని నాని కీలకంగా మారారు. ఢిల్లీ పర్యటన అంతా కేశినేని నాని చంద్రబాబు వెంటే ఉన్నారు. దీంతో ఆయనకు చంద్రబాబు మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష‌్టమయింది. ఇక కేశినేని నాని దూకుడు చూసి పార్టీలోని ప్రత్యర్థులు డైలమాలో పడ్డారు. బుద్దా వెంకన్న, బొండా ఉమలు సమాలోచనలు జరిపారు. కేశినేనికి ప్రాధాన్యత ఇవ్వడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో బెజవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

- Advertisement -

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags; Will Nani Change Colors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page