బి.కొత్తకోట హార్సిలీహిల్స్ లో గవర్నర్‌ బంగ్లాకు 60ఏళ్లు!

0 9,718

-గవర్నర్లకు హార్సిలీహిల్స్ వేసవి విడిది కేంద్రం
-1961లో బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన
-విడిది చేసిన పలువురు గవర్నర్లు, సీఎంలు

 

బి.కొత్తకోట ముచ్చట్లు:

- Advertisement -

హార్సిలీహిల్స్ పేరు వింటే గవర్నర్ల వేసవి విడది కేంద్రంగా గుర్తోస్తుంది. బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్లకు వేసవి విడది ఉండాలని భావించిన అప్పటి ప్రభుత్వం హార్సిలీహిల్స్ను ఎంపిక చేసింది. ఎందుకంటే కొండపైన అత్యంత చల్లని వాతావరణం, మండు వేసవిలోనూ ఉష్ణోగ్రత 32 సెంటిగ్రేడ్‌కు మించదు. దీనితో ఇక్కడికి వచ్చే గవర్నర్ల కోసం సదుపాయాలతో ఒక బంగ్లా నిర్మించాలని నిర్ణయించగా 1961 అక్టోబర్‌ 9న అప్పటి ప్రణాళిక, సమాచారశాఖ మంత్రి పిడతల రంగారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఏడాదికే పనులు పూర్తవగా, బంగ్లా వెనుక ప్రకృతి అందాలను తిలకిస్తూ చల్లటి గాలిని ఆస్వాదించేందుకు వీలుగా వచ్యీపాయింట్‌ను నిర్మించారు. గవర్నర్ల విడిది సమయంలో సేవలు అందించే సిబ్బందికి ప్రత్యేక గదులతో పెద్ద భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం జరిగే వరకు కొండపై అటవీశాఖ అతి•భవనం తప్ప మరో భవన ంలేదు.

కృష్ణకాంత్‌ ఉపరాష్ట్రపతి అయ్యారు

హార్సిలీహి ల్స్ గవర్నర్‌ బంగ్లాలో విడిది చేసిన వారిలో ఒక్క కృష్ణకాంత్‌ తప్ప మరెవరూ ఉన్నతస్థాయికి వెళ్లలేదు. 1980లలో కుముద్‌బెన్‌జోషి విడిది చేశారు. తర్వాత1993లో కృష్ణకాంత్‌ నాలుగైదురోజులు విడిది చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్‌గా పనిచేసి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన కృష్ణకాంత్‌ పదవిలో ఉండగానే మృతి చెందారు. ఆయన తర్వాతి గవర్నర్‌ డాక్టర్‌ సి.రంగరాజన్‌ కుటుంబసమేతంగా వారంరోజులు కొండపై విడిది చేశారు. ఈ వారంరోజులు సాంస్కతిక, వినోద కార్యక్రమాలు జరిగాయి. 2010 మార్చి 11న హార్సిలీహిల్స్వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ ఇక్కడ విడిది చేయలేదు. బంగ్లాలో ఆయన సూట్‌ ఆధునీకరించగా దాని ప్రారంభోత్సవానికి వచ్చారు. లేడి గవర్నర్‌ విమలా నరసింహన్‌ చేత ప్రారంభింపజేశారు. కొద్దిగంటలు మాత్రమే ఉండి తిరిగివెళ్లిపోయారు. ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రుల్లో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలు గవర్నర్‌ బంగ్లాలోనే విడిది చేశారు. మాజీ ప్రధాని ఐకే.గుజ్రాల్‌ కూడా బంగ్లాలోనే విడిది చేశారు. కర్ణాటక, ఉమ్మడి ఏపీకి చెందిన ఉన్నతస్థాయి అధికారులు, మంత్రులు ఇక్కడే విడిది చేస్తుంటారు. అప్పట్లో బంగ్లాలో కొన్ని గదులు, గవర్నర్‌ సూట్‌ను ప్రత్యేకంగా నిర్మించగా నిర్వహణ బాధ్యతలను మదనపల్లె ప్రజాపనులశాఖ అధికారులు పర్యవేక్షించేవారు.

ఇప్పడు టూరిజం చేతిలోకి

2000 ఏడాదిలో కొండపైకి పర్యాటకశాఖ అడుగుపెట్టింది. అప్పటికే కొండపైనున్న కొన్ని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకొని కార్యకలాపాలను ప్రారంభించింది. అతి•గృహలను సమకూర్చుకొంది. ప్రభుత్వ ఆధీనంలోని గవర్నర్‌ బంగ్లాను అధికారుల నిర్వహణ నుంచి తప్పిస్తూ పర్యాటకశాఖకు అప్పగించడంతో గదులను అద్దెకు ఇవ్వడం వెహోదలైంది. కొత్తలో గవర్నర్‌ బంగ్లా గదిలో విడిది అంటే ఓ హ్గదాగా భావించేవారు. బంగ్లాలో గవర్నర్లు సమావేశాలు నిర్వహించే మీటింగ్‌ హాలు, భోజనం చేసే డైనింగ్‌ హాలును తొలగించి గదులుగా మార్చేశారు. గవర్నర్‌ సూట్‌ గది మినహా మిగిలిన గదులన్నింటిని ఆన్‌లైన్‌లో ఉంచి సందర్శకులకు కేటాయిస్తున్నారు. గవర్నర్‌ సిబ్బంది కోసం నిర్మించిన భవనంలో టూరిజం సిబ్బంది నివాసం ఉంటున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags; B. 60 years to the Governor’s bungalow in Kottakotta Horsleyhills!

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page