శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

0 1,007

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శ‌నివారం రాత్రి భారత హోం మంత్రి   అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  దర్శించుకున్నారు. వీరి వెంట పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.శ్రీవారి ఆలయం మ‌హాద్వారం వ‌ద్ద  హోం మంత్రి, ముఖ్యమంత్రి కి టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి , ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి  స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోం మంత్రి, ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించి, భాష్యకార్లను, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి కి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను, కాఫీ టేబుల్ బుక్‌, 2022 డైరీ, క్యాలెండ‌ర్‌, అగ‌ర‌బ‌త్తులు హోంమంత్రి  అమిత్ షాకుఅందజేశారు.

 

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రి వెలం పల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు  ఆదిమూలం, ఎమ్మెల్సీ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి,ఎంపిలు డాక్టర్ గురుమూర్తి, శ్రీ సి ఎం రమేష్, తిరుపతి డిప్యూటి మేయర్  భూమన అభినయ్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త  తలసిల రఘురామ్, చీఫ్ సెక్రటరీ  సునీల్ శర్మ, డిజిపి  గౌతమ్ సవాంగ్, జెఈవో  వీర బ్రహ్మం సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్  హ‌రినారాయ‌ణ‌, అర్బన్ ఎస్పీ  వెంకట అప్పల నాయుడు, డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags:Indian Home Minister Amit Shah and Chief Minister YS Jaganmohan Reddy visited Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page