పెరుగుతున్న దూరం…

0 9,664

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు పార్టీ వ్యవహారాల పట్ల సంతృప్తికరంగా లేరు. తనను కొన్ని పనులకే అధినాయకత్వం వాడుకుంటుందని భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నాటి నుంచి అచ్చెన్నాయుడుకు అంత ప్రయారిటీ పార్టీలో లభించడం లేదు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయనను ఇన్ వాల్వ్ చేయడం లేదు. పార్టీ నేతలు కూడా అచ్చెన్నాయుడుతో దూరం మెయిన్ టెయిన్ చేస్తుండటం టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అప్పటి నుంచే….? అచ్చెన్నాయుడు తిరుపతి లో లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు అధినాయకత్వం దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రకటనలు మాత్రమే అచ్చెన్నాయుడు చేత చేయిస్తున్నారు. మరోవైపు ఆయన జిల్లాలను పర్యటించాలనుకుంటున్నా అనుమతి లభించడం లేదు. మొన్నా మధ్య అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జిని నిరసిస్తూ అచ్చెన్న అక్కడకు వెళ్లాలనుకున్నారట. కానీ అధినాయకత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు…. తీరా అక్కడకు లోకేష్ ను పంపించారు. ఇక స్థానిక ఎన్నికల విషయంలోనూ అచ్చెన్నాయుడును దూరంగానే ఉంచారని తెలిసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు అక్కడకు వెళదామనుకున్నా వీలుకాలేదు. ఏ ఎన్నికలకూ అచ్చెన్నను దూరంగానే అధినాయకత్వం ఉంచినట్లు తెలిసింది. కుప్పం నియోజకవర్గానికి కూడా చంద్రబాబు తనకు నమ్మకమైన నేతలను మాత్రమే పంపారు. అందుకే జిల్లాలోనే…. దీంతో అచ్చెన్నాయుడును చంద్రబాబు దూరంగా ఉంచుతున్నారన్న టాక్ పార్టీలో బాగానే విన్పిస్తుంది. చంద్రబాబు 36 గంటల దీక్ష సమయంలోనూ అచ్చెన్నాయుడుకు ఆయన పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదని, మిగిలిన నేతలతో మాట్లాడినట్లు అచ్చెన్నతో సరిగా మాట్లాడలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో అచ్చెన్నాయుడు కొంత అసంతృప్తితో ఉన్నారని, అందుకే తన జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారని.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Growing distance …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page