భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం

0 9,714

– క్యూలైన్లమార్పు పై చర్చించిన రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
– అభివృద్ది పనులు పరిశీలన
– మంత్రి పెద్దిరెడ్డి పర్యటన కు సిద్దం చేయాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు సులభతరంగా అతిదగ్గరనుంచి అమ్మవారిని దర్శించుకొనేలా చర్యలు తీసుకొంటున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, ఆలయ ఈఓ చంద్రమౌళితో కలిసి బోయకొండలో జరుగుతున్న పలు అభివృద్దిపనులను పరిశీలించారు.ఆలయం వద్ద జరుగుతున్న పొంగల్‌ షెడ్లు, విధ్యుత్‌ధీకరణ పనులు నెలాఖరులోపు పూర్తిచేయాలని సూచించారు. పనులు పూర్తిచేసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లుకు పెద్దిరెడ్డి సూచించారు. బోయకొండలో ప్రస్తుతం ఉన్న క్యూలైన్లును మార్పు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం అతిదగ్గనుంచి నేరుగా వెళ్ళి దర్శించుకొనేలా కొత్తగా క్యూలైన్లు ఏర్పాటుచేసేందుకు చర్చించారు. ఆలయం వద్ద హ్గమ గుండం పనులను పరిశీలించారు. ఆలయం వద్ద వెహోక్కల సంరక్షణతోపాటు, పార్క్ సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. భక్తులకు అవసరమైన సదుపాయాలతోపాటు ప్రస్తుతం ఉన్న సేవలపై భక్తులతో మాట్లాడి ఆరా తీశారు. ఆయన వెంట పాలక మండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, సోమల మల్లికార్జునరెడ్డి, సదుం కోఆప్షన్‌ మెంబర్‌ ఇంమ్రాన్‌, లడ్డూరమణ, నవీన్‌, శంకరప్ప, తదితరులున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: It is easy for the devotees to see the Goddess

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page