పోరాడి సాధించుకున్న అర్పితా

0 9,689

రాయ్ పూర్ ముచ్చట్లు:

 

చత్తీస్ గఢ్ లో తన భర్త కోసం  ఓ మహిళ అడవిబాట పట్టింది. మూడేళ్ల వయస్సున్న తన  కుమారుడిని చంకనెత్తుకుని.. భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మంకెల్లిలో జరిగింది. అజయ్ లక్రా అనే ఇంజినీర్.. మంకెల్లి ఏరియాలో రోడ్డు నిర్మాణ పనుల్ను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మావోయిస్టులు… అజయ్ రోషన్ తో పాటు.. అతని దగ్గర పనిచేసే అటెండర్ లక్ష్మణ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. భర్త కోసం ఏడుస్తూ ఆమె ఇంట్లోనే కూర్చోలేదు. భర్తను విడిపించుకునేందుకు బయలుదేరింది. తన మూడేళ్ల కొడుకును తీసుకుని.. భర్తకోసం అడవి బాట పట్టింది. తనకు భర్త తప్ప మరో మరెవరూ లేరని.. ఆయన లేకుంటే తాను ఉండలేనని అడవిలోకి బయలుదేరింది. భర్త ఎక్కడున్నాడో తెలియదు. మావోయిస్టులు అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. వదిలేస్తారనే ఆశ లేదు. చంపేస్తారేమోననే భయంతోనే ఆమె ఒంటిరిగా అడవిలో ప్రయాణం మొదలుపెట్టింది. అయినా భర్తపై ఉన్న ప్రేమ ఆమెను ఇంట్లో ఉండనివ్వలేదు. కన్నీటిని తుడుచుకుంటూ.. తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ భర్తకోసం అడవిబాటపట్టింది.అయితే.. అప్పటికే భద్రతా బలగాలు, అధికారులు, ప్రజాసంఘాలు, మీడియా ప్రతినిధులు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపారు. కిడ్నాప్ చేసిన ఇద్దరిని వదిలిపెట్టాలని మావోయిస్టులను రిక్వెస్ట్ చేశారు. ఇంజినీర్లకు హాని తలపెట్టొద్దని కోరారు. చర్చలతో దిగివచ్చిన మావోయిస్టులు.. స్థానికంగా ఓ గ్రామంలో ఇద్దరిని వదిలిపెట్టారు. భర్తను విడిపించుకోవడానికి భార్య చేసిన సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. అర్పితా లక్రా ధైర్యానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags; Arpita who fought and achieved

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page