పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం-  జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

0 9,688

జగిత్యాల  ముచ్చట్లు:

 

తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ వెంట నడిచిన పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని,రాజీ లేని పోరాటం చేసున్నామని తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పెన్షనర్ల  ప్రతినిధుల సమావేశం సంఘ కార్యాలయంలో కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించారు. ఇటీవల మరణించిన కొరుట్ల కార్యదర్శి గుడ్ల గంగాధర్ ఆకస్మిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు.ఈ సమావేశ  సందర్భంగా హరి ఆశోక్ కుమార్  మాట్లాడుతూ తమ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో పెన్షనర్లకు చెల్లించాల్సిన ప్రయోజనాల గురించి రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. పీఆర్సీ వాయిదాలు,4 డి.ఏ. ల బకాయిలు,1జులై 2018 నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రివైజ్డ్ పెన్షన్ అమలు చేయాలని,పీఆర్సీ సిఫార్సు మేరకు అంత్యక్రియల ఖర్చులురూ 30 వేలకు పెంచాలని,జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల,జర్నలిస్టులకు వైద్య సహాయం  ఆరోగ్య కార్డులపై  అందించడానికి వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించి,

 

 

- Advertisement -

వినతిపత్రం సమర్పించామన్నారు.కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పెన్షనర్ల సమస్యలను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడం పట్ల తమ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.  పెన్షనర్లు లైఫ్ సెర్టిఫికెట్  మార్చి 20 వరకు సమర్పించ వచ్చని ,టీ యాప్ ఫోలియోలో  లైఫ్ సెర్టిఫికెట్  నమోదుకు ప్రయత్నిచాలని,వీలు కానివారికి  ట్రెజరీ కారుఆలయాల్లో సైతం స్వీకరించాలని తమ అసోసియేషన్ వినతి మేరకు   రాష్ట్ర పెన్షన్ విభాగపు జాయింట్ డైరెక్టర్  ఎం.పద్మజ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.కొరుట్ల   నియోజకవర్గ శాఖ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బా  శివానందం మాట్లాడుతూ తమ సంఘ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించి,నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కోరారు.పెన్షనర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేసేది తమ అసోసియేషన్  రాష్ట్రంలో, జిల్లాల్లో ఒక్కటేనని,నియోజకవర్గములో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేస్తున్న తీరును వివరించారు. పెన్షనర్లకు సకాలంలో  నెల నెల  ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ డబ్బులు అందిస్తున్న ట్రెజరీ అధికారులకు,సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, కొరుట్ల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్,ఉపాధ్యక్షుడు సైఫోద్దీన్,ఆర్.భూమయ్య,రాములు, నర్సయ్య,లక్ష్మినారాయణ, గంగారాం,లక్ష్మికాంతం, వివిధ మండలాల పెన్షనర్స్ అసోసియేషన్  ప్రతినిధులు పాల్గొన్నారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: Uncompromising struggle for the solution of the problems of pensioners – District President Hari Ashok Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page