అధికారులకు యాప్ ల యాతన

0 9,861

వరంగల్  ముచ్చట్లు:

 

పంచాయతీల్లో పనులు మరింత బాగా చేయడం, ప‌‌ర్యవేక్షణ కోసం పంచాయ‌‌తీరాజ్ శాఖ తయారు చేసిన రెండు‌‌ మొబైల్ యాప్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్, జూనియర్ పీఆర్ సెక్రటరీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్రు. ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండా యాప్ ల నిర్వహణ ఎలా అని ప్రశ్నిస్తున్నరు. డ్యూటీలో చేరిన నాటి నుంచి వర్క్ ప్రెజర్‌తో ఇబ్బంది పడుతున్నామని, వందలాది మంది జాబ్ వదిలేశారని, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నరు. యాప్ ల బాధ్యతల నుంచి తమను తప్పించాలని కోరుతున్నరు. ఆందోళన చేపడుతుండటంతో పాటు అధికారులు వినతిపత్రాలు ఇస్తున్నరు.పల్లె ప్రగతి – పీ.ఎస్. యాప్ (పంచాయ‌‌తీ సెక్రటరీ యాప్), పల్లె ప్రగతి – పర్యవేక్షణ యాప్ (ఇన్స్ పెక్షన్ ఆఫీసర్ యాప్)లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల రిలీజ్ చేశారు. పల్లె ప్రగతి – పీ.ఎస్. యాప్ లో రోజు వారి శానిటేషన్ వర్క్స్, రోడ్లు, డ్రైనేజీలు, సర్కార్ ఆఫీసులు క్లీన్ చేయడం, ఇండ్ల నుంచి చెత్త తీసుకెళ్లడం, స్ట్రీట్ లైట్స్ మేయింటెనెన్స్ వివరాలు ఉన్నాయి. పీఎస్ యాప్‌‌లో సెక్రటరీ రిపోర్ట్ చేసినవి.. డేటా చెక్ యాప్‌‌కు వెళ్తాయి. వీటిని చెకింగ్ ఆఫీసర్లు (ఎంపీవో, డీఎల్ పీవో, డీపీవో) సర్టిఫై చేస్తారు. ఒక వారంలో చెక్చేయడం కోసం ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాగిన్ కు అప్ లోడ్ చేయాలని తెలిపారు.ఈ యాప్‌‌ల పర్యవేక్షణపై 11 మంది ఆఫీసర్లకు బాధ్యతలిస్తూ కమిషనర్ రఘనందన్ రావు ఇటీవల ఆర్డర్లు ఇచ్చారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని పేర్కొన్నారు. ఈ యాప్ ల అమలు, సెక్రటరీలు అప్ లోడ్ చేసే రిపోర్టుల ఆధారంగా జూనియర్ సెక్రటరీలపై చర్యలు తీసుకునే చాన్స్ఉన్నట్లు తెలుస్తోంది. 2018 లో మొత్తం 9,300 కు పైగా జూనియర్ సెక్రటరీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, డ్యూటీలో చేరిన నాటి నుంచి చాలా మంది జాబ్ కు రిజైన్ చేయటం, ఇతర జాబ్ లకు వెళ్లటంతో ఇప్పుడు 8 వేల మందే పనిచేస్తున్నారు. ఈ యాప్ లు అమలులోకి తెచ్చాక మరింత మంది రాజీనామా చేస్తారని పీఆర్ సెక్రటరీల సంఘం నేతలు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags: The agony of apps for officers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page