వింత శబ్దాలతో గ్రామస్థుల అందోళన

0 8,575

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గత కొద్దిరోజులుగా ఐరాల మండలం అబ్బుగుండు ప్రాంతంలో భూమి నుండి వింత శబ్దాలు వస్తున్నాయి.  ఇప్పుడు పక్కనే ఉన్న గ్రామాలకు సైతం వ్యాపించి గ్రామస్తులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పది రోజుల క్రితం ఐరాల మండలం అబ్బుగుండు ప్రాంతంలో భూమి నుండి వింత శబ్దాలతో పాటు భూమి కంపించడంతో ఐరాల మండల స్థాయి అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు సందర్శన స్థలానికి సందర్శించి భయపడనవసరం లేదని హామీ ఇచ్చారు. ఇప్పుడు అబ్బుగుండు నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న  తుమ్మల వారి  పల్లెలో భూమిలో నుంచి వింత శబ్దాలు రావడంతో  గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు మండల ఎమ్మార్వో విజయ భాస్కర్, ఎండీవో  గౌరీ,  ఎస్సై .మనోహర్ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని గమనిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags: Anxiety of the villagers with strange noises

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page