స్వదేశ్ ప్రాజెక్టును పరిశీలించిన కేంద్రమంత్రి

0 9,661

విశాఖపట్నం ముచ్చట్లు:

 

విశాఖ, భావికొండ బుద్ధిష్ట్ కాంప్లెక్స్ లో స్వదేస్ 2.0 ప్రాజెక్ట్ ను  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్ వున్నారు. మంత్రి అవంతి మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇదే మొదటి సారి విశాఖ కు రావటం చాలా ఆనందంగా ఉంది. విశాఖ టూరిజం హబ్ గా ఎన్నో బీచ్ లు సరస్సులు దేవాలయాలు ఉన్నాయి. సౌత్ ఇండియా లో కేరళ తర్వాత ఆంధ్ర లో విశాఖ రెండవ స్థానం లో ఉంది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ గా వచ్చే నిధులు నుంచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం లో 90% పర్యాటకం గా అభివృద్ధి చేశాం. కొంత మంది కోర్టు కు వెళ్లి పిల్ వేయటం మూలాన తోట్ల కొండ అభివృద్ధి లో వెనుకబడింది. అన్నవరం లో మరో 50 కోట్లు ప్రసాదం స్కీమ్ ద్వార కేంద్రం ప్రకటించింది. కేంద్రం తరుపున అభివృద్ధి తెలంగాణలో కాకుండా అంద్రలో కూడా అభివృద్ధి చేయాలని అన్నారు.

 

 

- Advertisement -

కిషన్ రెడ్డి మాట్లాడుతూ అటు పర్యాటకం వస్తున్న సమస్యలు, పర్యాటకంగా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అని అధికారులతో చర్చించి చెప్తాం. ఆంధ్ర లో అన్ని రకాలుగా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికి రావటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విదేశీ పర్యాటకులు ఆంధ్రాలోనే వచ్చే విధంగా చర్యలు, అలాగే తిరుపతి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం దేవస్థానం కు 43 కోట్లు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కొరకు ప్రకటించాం. అలాగే అన్నవరం, సింహాచలం కూడా అన్నీ రకాలుగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు వేస్తున్నాం. కాకినాడ కోస్టల్ టూరిజం పేరు మీద 68 కోట్లు మంజూరు చేశాం, పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. నెల్లూరు మరొక కోస్టల్ టూరిజం క్రింద 49 కోట్లు మంజూరు చేశాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భోద్ధిస్ట్ పెరు మీద పనులు జరుగుతున్నాయి. అమరావతి నీ కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తాం. బుద్ధ భగవాన్ దేవాలయం ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ మౌలిక సదుపాయాలు తో అభివృద్ధి చేస్తామని అన్నారు.

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags; Union Minister examining Swadesh project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page