శ్రీ అగస్తీశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేణుగోపాల్ రెడ్డి

0 9,694

పుంగనూరు ముచ్చట్లు:

 

నెక్కుంది గ్రామంలో వెలసియుండు చారిత్రాత్మకమైన శ్రీ అగస్తీశ్వరస్వామి వారి దేవాలయ రాజగోపుర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రాజ గోపుర పునర్నిర్మాణకర్త అయిన చదళ్ళ గ్రామ వాస్తవ్యులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి గత నాలుగు రోజుల నుండి ప్రత్యేక పూజలు, హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను కూడా లెక్క చేయక అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు ఎన్.వి.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తాదులు విచ్చేసి స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి కృపాకటాక్షాలు పొందాలని వేణు గోపాల్ రెడ్డి మరియు ఎన్.వి.ఆర్. ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవి కుమార్, శంకర్ రెడ్డి, నాగరాజ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, సందీప్ రెడ్డి తదతరులు.పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags: Venugopal Reddy conducting special pujas at Sri Agastheeswaraswamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page