పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

0 9,115

పుంగనూరు ముచ్చట్లు:

 

వరద ముంపుకు గురైన ప్రతిసెంటు భూమిలోని పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసి, ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని తిమ్మికృష్ణాపురము, పట్టణంలోని రాయలచెరువు , పంటలను పరిశీలించారు. ముంపుకు గురైన భాధితులను పరామర్శించి, ఆయన ఆవేదనకు లోనైయ్యారు. బాధితులకు బియ్యం, పప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో రోడ్లు , కల్వర్టులు పాడైందన్నారు. వీటిని వర్షాలు తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతామన్నారు. ఇరవై ఏళ్లలో ఎన్నడు లేని విధంగా వర్షాలు పడటంతో చెరువులు, కుంటలు పొంగి ప్రవహించడంతో వరదముంపుకు గురికావాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా వర్షాలు కారణంగా భూగర్భజలాల మట్టం పెరగడంతో తాగునీటి సమస్య తీరనున్నదని అన్నారు. రైతులకు 80 శాతం సబ్సిడితో విత్తనాలు అందిస్తామన్నారు. అలాగే రైతులకు అవసరమైన సహాయాన్ని ఆర్‌బికెల ద్వారా అందిస్తామన్నారు. అలాగే వరదనీటిలో మునిగిపోయిన కుటుంభాల వారికి ఆర్థిక సహాయంతో పాటు దెబ్బతిన్న ఇండ్ల స్థలంలో నూతన ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి మండలి సమీక్షలో తెలిపిన మేరకు ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించి, ఆదుకుంటామని , ఎవరు ఆందోళన చెందరాదని , ఆపోహాలకు తావు ఇవ్వరాదని కోరారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపి రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, పీడీ చంద్రశేఖర్‌, సీఈవో ప్రభాకర్‌రెడ్డి , ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags;We will provide financial assistance to all flood victims in Punganur – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page