ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం

0 9,673

తిరుమల ముచ్చట్లు:

 

ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్లలోని కొండచరియలు విరిగిప‌డిన విష‌యం విధిత‌మే. ఈ నేపథ్యంలో అలిపిరి, తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాలు, రెండు ఘాట్‌ రోడ్లలోని కొండచరియలను చెన్నై ఐఐటి నిపుణుల బృందం బుధ‌వారం ఉదయం పరిశీలించింది.టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేరకు కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటి నిపుణులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిటిడి ఇంజినీరింగ్ అధికారులు వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న రోడ్లు, గోడ‌లు త‌దిత‌ర ప్రాంతాల‌ను ఐఐటి నిపుణులకు చూపించి వివ‌రించారు.ఐఐటి నిపుణులు త్వరలో స‌మ‌గ్ర నివేదికను టిటిడి ఉన్న‌తాధికారుల‌కు అందిచ‌నున్నారు. ఈ మేరకు కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలు టిటిడి చేప‌ట్ట‌నుంది.ఈ కార్యక్రమంలో టిటిడి సాంకేతిక స‌ల‌హాదారు  కొండ‌ల‌రావు, ఐఐటి నిపుణులు ప్రొఫెసర్ కె.న‌ర‌సింహ‌రావు, డా.సి.వి.ప్ర‌సాద్‌, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: A team of IIT experts examines landslides on Ghat Roads

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page